చెన్నై సోయగం త్రిష ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో లీడింగ్ హీరోలతో సినిమాలు చేస్తోందిAjith Kumar. దీంతోపాటు మాలీవుడ్ యాక్టర్ టొవినో థామస్ నటిస్తోన్న ఒక సినిమా కూడా ఉంది. కాగా 2025 జనవరిలో త్రిష అభిమానులు, ఫాలోవర్లకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతుందన్న వార్త నెట్టింట రౌండప్ చేస్తోంది. విదాముయార్చి 2025 సంక్రాంతి కానుకగా రాబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు టొవినో థామస్ సినిమా కూడా జనవరిలోనే రాబోతోంది. టొవినో థామస్‌తో చేస్తున్న ఐడెంటిటీ మలయాళంలో త్రిష రెండో సినిమా. ఈ రెండు సినిమాల విడుదల తేదీలపై క్లారిటీ రావాల్సి ఉండగా.. తాజా వార్తల ప్రకారం ఒకేసారి త్రిష డబుల్ ట్రీట్ ఇవ్వబోతుండటం ఖాయమైనట్టే. ఈ లెక్కన త్రిష అభిమానులకు మాత్రం పండగే అని చెప్పాలి. మరోవైపు మోహన్‌లాల్‌తో రామ్, అజిత్ కుమార్ – అధిక్ రవిచంద్రన్ గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రాజెక్ట్, మణిరత్నం- కమల్‌హాసన్ థగ్ లైఫ్ సినిమాలు కూడా త్రిష లైన్‌లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన విదాముయార్చి టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
- November 29, 2024
0
127
Less than a minute
You can share this post!
editor

