బాబీతో మరోసారి బ్లాక్‌బస్టర్‌కు సిద్ధమైన చిరంజీవి..!

బాబీతో మరోసారి బ్లాక్‌బస్టర్‌కు సిద్ధమైన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘చిరు158’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ సక్సెస్‌ఫుల్ కాంబో మరోసారి చేతులు కలపడంతో అభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. తొలి షెడ్యూల్‌లో చిరంజీవి, అనస్వర రాజన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మేకర్స్ విడుదల చేసిన BTS వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో చిరంజీవి “లెట్స్ సెట్ ది బ్లడీ బెంచ్‌మార్క్” అంటూ ఎనర్జీతో కనిపించారు. దర్శకుడు బాబీని టైటిల్ గురించి అడుగుతూ సరదాగా చేసిన కామెంట్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. చిరంజీవి ఈ సినిమాలో పవర్‌ఫుల్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు.

Related Articles