‘ఇట్లు అర్జున’ నుంచి బ్యూటీఫుల్ ఫస్ట్ సింగిల్ రాబోతోంది.!

‘ఇట్లు అర్జున’ నుంచి బ్యూటీఫుల్ ఫస్ట్ సింగిల్ రాబోతోంది.!

స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాణంలో రూపొందుతున్న తొలి చిత్రం ‘ఇట్లు అర్జున’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. “న్యూ గై ఇన్ టౌన్” అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌తో మంచి బజ్‌ను సొంతం చేసుకుంది. అక్కినేని నాగార్జున అందించిన పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాజాగా ఫస్ట్ సింగిల్ ప్రోమోను విడుదల చేసిన మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. ప్రోమోలో థమన్ ఎస్, హీరో అనీష్ మధ్య జరిగే సరదా సంభాషణ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. థమన్ అందించిన సాఫ్ట్ మెలోడీ మంచి ఫీల్‌ను ఇస్తోంది. మే 28న విడుదల కానున్న ఫస్ట్ సింగిల్‌పై సంగీత ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చెవిటి, మూగ యువకుడి కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంగీతం కీలక పాత్ర పోషించనుంది.

Related Articles