‘కిస్సిక్’ సాంగ్‌పై సమంతా కీలక వ్యాఖ్యలు

‘కిస్సిక్’ సాంగ్‌పై సమంతా కీలక వ్యాఖ్యలు

‘పుష్ప-2 ది రూల్‌’ చిత్రంలో అందాల తార శ్రీలీల, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ల ఐటమ్ సాంగ్ లిరికల్ సాంగ్ ఇటీవల రిలీజైన సంగతి తెలిసిందే. ఈ పాట ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పాటపై ‘పుష్ప ది రైజ్‌’లో ఇలాంటి ఐటమ్ సాంగ్‌లోనే ‘ఊ అంటావా మావా’ అంటూ అలరించిన నటి సమంత స్పందించారు. ఈ పాటకు ఫైర్ ఎమోజీలు జత చేస్తూ రివ్యూ ఇచ్చింది. శ్రీలీల, బన్నీల స్పెషల్ సాంగ్ ఫైర్ అయ్యిందని వ్యాఖ్యానిస్తూ, ‘పుష్ప 2’ కోసం ఎదురుచూస్తున్నా అంటూ కామెంట్ చేసింది. ఈ చిత్రం డిసెంబర్ 5న థియేటర్స్‌లోకి రానుంది.

editor

Related Articles