జీ తెలుగు నుంచి మరో ఆసక్తికరమైన ఒరిజినల్ సిరీస్‌గా ‘మేము కాప్’లం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. రా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై బీవీఎస్ రవి నిర్మించిన ఈ సిరీస్‌కు ‘వికటకవి’ ఫేమ్ ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించారు. నాగబాబు కొణిదెల ప్రధాన పాత్రలో నటిస్తుండగా, గెటప్ శ్రీను, రవితేజ నన్నిమాల కీలక పాత్రలు పోషించారు. మే 22 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌కు తమన్, బండ్ల గణేష్, అజయ్ భూపతి, కోన వెంకట్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తమన్ మాట్లాడుతూ మంచి కథలతో వస్తున్న సిరీస్‌లకు సంగీతం అందించడం ఆనందంగా ఉందన్నారు. ‘మేము కాప్’లం’ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సిరీస్‌లో ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్, డ్రామా ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.
- May 23, 2026
0
7
Less than a minute
You can share this post!
editor

