తండ్రీకూతుళ్ల బంధంతో ‘నాన్న కుట్టి’ ఎమోషనల్ డ్రామా..!

తండ్రీకూతుళ్ల బంధంతో ‘నాన్న కుట్టి’ ఎమోషనల్ డ్రామా..!

విజయ్ ఆంటోనీ హీరోగా, ము. మారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భావోద్వేగ యాక్షన్ డ్రామా ‘నాన్న కుట్టి’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోని నిర్మిస్తున్నారు. సర్వంత్ రామ్ క్రియేషన్స్ అధినేత రామాంజనేయులు జవ్వాజీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఆగస్టులో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో విజయ్ ఆంటోనీ రక్తంతో కనిపిస్తూ ఇంటెన్స్ లుక్‌తో ఆకట్టుకున్నారు. ఈ చిత్రం తండ్రీకూతుళ్ల బంధాన్ని హైలైట్ చేస్తూ యాక్షన్, భావోద్వేగాలు, ఫ్యామిలీ డ్రామాను కలిపి రూపొందిస్తున్నారు. ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ ఆంటోనీ సంగీతంతో పాటు ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహించడం విశేషం.

Related Articles