ప్రపంచ సినీ వేదికపై సముచితస్థానాన్ని దక్కించుకున్న భారతీయ సినీదర్శకుడు మాత్రం ఒక్క రాజమౌళి మాత్రమే. ఆయన సినిమా ఓపెనింగ్‌కి ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్ రానున్నారని తెలుస్తోంది. మహేష్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో కె.ఎల్.నారాయణ నిర్మించే ఈ పాన్ వరల్డ్ మూవీ 2025 జనవరిలో ప్రారంభం కానున్నదనేది లేటెస్ట్ న్యూస్. ఈ వేడుకకు జేమ్స్ కామెరూన్, స్టీవెల్ స్పీల్‌బర్గ్ అతిథులుగా రానున్నారని సమాచారం. ఈ ఫ్రాంచైజీని వెయ్యికోట్ల బడ్జెట్‌తో నిర్మించనున్నట్టు సమాచారం. 50 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ట్రజర్ హంట్ కథాంశమని టాక్. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా చేస్తున్నారు.

- November 29, 2024
0
24
Less than a minute
You can share this post!
editor