టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండే నటీమణుల్లో ఒకరు. తాజాగా ఓ మ్యాగజైన్ కవర్ షూట్ సందర్భంగా ఆమె తన సినిమా ఎంపికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమంత మాట్లాడుతూ, తాను చేసే సినిమాల్లో కథే అసలు హీరో అని పేర్కొన్నారు. నిర్మాతలు, నటీనటుల కంటే కథే ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. సమాజంలో మహిళలకు సరైన ప్రాతినిధ్యం ఉండాలని, సినిమాల్లో మహిళా పాత్రలు ప్రేక్షకులను ప్రభావితం చేయాలని ఆమె అన్నారు. సినిమాలు చూసే మహిళలు ఆ పాత్రలతో తమను తాము అనుసంధానం చేసుకునేలా ఉండాలని ఆమె భావిస్తున్నారు. అందుకే ఇకపై అలాంటి కథలతో వచ్చే చిత్రాల్లోనే నటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇక తన కొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’ కుటుంబం మొత్తం ఆస్వాదించేలా రూపొందించామని సమంత వెల్లడించారు. ఈ సినిమాతో ఆమె ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
- May 11, 2026
0
154
Less than a minute
You can share this post!
editor

