సత్య, యోగి బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించింది. ‘రంగబలి’ సినిమాతో గుర్తింపు పొందిన దర్శకుడు పవన్ బసంశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నాగార్జున రెడ్డితో కలిసి ఆయన స్వయంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. నయవాయు చిత్రాలు, డ్రీమ్ మూవీ మేకర్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమా గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌తో ప్రారంభమైంది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముహూర్తపు షాట్‌కు దర్శకుడు కిషోర్ తిరుమల క్లాప్ కొట్టగా, దర్శకుడు మహేష్ బాబు పి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సత్య, యోగి బాబుల అద్భుతమైన కామెడీ టైమింగ్‌ను ప్రధానంగా తీసుకుని ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా రూపొందుతోంది. బాబ్లు అజు సినిమాటోగ్రఫీ అందించగా, పవన్ సి.హెచ్ సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు విడుదల కానున్నాయి.
- May 11, 2026
0
8
Less than a minute
You can share this post!
editor

