టాలీవుడ్లో సీనియర్ స్టార్లు మళ్లీ జోరు పెంచారు. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ తమ సినిమాలతో దూసుకెళుతున్నారు. చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్గా నిలవగా, ఇప్పుడు ‘విశ్వంభర’తో పాటు తన 158వ సినిమాతో రెడీ అవుతున్నారు. ఈ మూవీలో చిరు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో కనిపించనున్నారని సమాచారం.
ఇక బాలకృష్ణ కూడా ఫుల్ ఫామ్లో ఉన్నారు. గోపీచంద్ మలినేనితో చేస్తున్న NBK111 పై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే కొరటాల శివతో NBK112 కూడా లాక్ చేశారు. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రెండు సినిమాల నుంచి సర్ప్రైజ్ అప్డేట్స్ రానున్నాయి. ఇలా ఈ ఇద్దరు స్టార్ల జోరు చూస్తుంటే టాలీవుడ్లో మాస్ హీట్ పెరిగిపోయింది. యంగ్ హీరోలకు ఇది కఠినమైన పోటీగా మారనుంది.

