ప్రశాంత్ నీల్ మూవీలో మలయాళ నటి ఎంట్రీ..!

ప్రశాంత్ నీల్ మూవీలో మలయాళ నటి ఎంట్రీ..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా మలయాళ నటి దర్శన రాజేంద్రన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమె షూటింగ్‌లో పాల్గొన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కథలో భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో దర్శన కనిపించనుందని సమాచారం.

అలాగే ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌లో ఓ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే సాధారణంగా డార్క్ టోన్, బ్లాక్ అండ్ గ్రే షేడ్ విజువల్స్ గుర్తుకు వస్తాయి. అయితే ‘డ్రాగన్’లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను పూర్తిగా కలర్‌ఫుల్‌గా తెరకెక్కిస్తున్నారనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మొత్తంగా ‘డ్రాగన్’ బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టిస్తుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది.

Related Articles