ప్రేమకు న్యాయం కోసం కోర్టుకు వెళ్లిన యువకుడు..!

ప్రేమకు న్యాయం కోసం కోర్టుకు వెళ్లిన యువకుడు..!

ప్రేమ, విరహం, మోసం వంటి భావోద్వేగాల నేపథ్యంలో రూపొందుతున్న వినూత్న లీగల్ లవ్ డ్రామా ‘ఒక కోర్టు కేస్’ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఓపెన్ ఐస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గణేష్ పూడి దర్శకత్వం వహించి నిర్మించిన ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ప్రేమలో మోసపోయిన ఓ యువకుడు తనకు జరిగిన అన్యాయానికి న్యాయం కోసం కోర్టును ఆశ్రయించడం అనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. టీజర్ విడుదల అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రస్తుత యువతకు దగ్గరగా ఉండే అంశాన్ని దర్శకుడు కొత్త కోణంలో చూపించారని ప్రశంసించారు. ప్రతి షాట్ ఉత్కంఠను పెంచేలా ఉందని, సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. హీరో సూర్యాన్ష్, హీరోయిన్ తనిషా మిశ్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో థర్టీ ఇయర్స్ పృథ్వి, సత్యకృష్ణ, దయానంద్, ముక్తార్ కీలక పాత్రలు పోషించారు. ప్రేమలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ఈ చిత్రం 2026 జూలై 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Related Articles