రిపీట్ కానున్న వెట్రిమారన్ – విజయ్ సేతుపతి కాంబో?

రిపీట్ కానున్న వెట్రిమారన్ – విజయ్ సేతుపతి కాంబో?

తమిళ స్టార్ దర్శకుడు వెట్రిమారన్, నటుడు విజయ్ సేతుపతి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందనే వార్తలు కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం శింబు హీరోగా తెరకెక్కుతున్న ‘అరసన్’ సినిమాతో బిజీగా ఉన్న వెట్రిమారన్, ఆ తర్వాత విజయ్ సేతుపతితో కొత్త ప్రాజెక్ట్ చేయనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘విడుదల’, ‘విడుదల పార్ట్-2’ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేయనున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

తాజా ప్రచారం ప్రకారం, ఈసారి వెట్రిమారన్ తన శైలికి భిన్నంగా ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నారట. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరోవైపు, వెట్రిమారన్ – ధనుష్ కాంబినేషన్‌లో ‘వడ చెన్నై 2’ కూడా లైన్లో ఉంది. దీంతో విజయ్ సేతుపతి ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తను ప్రచారంగానే చూడాల్సి ఉంటుంది.

Related Articles