‘జాతిరత్నాలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తన గ్లామర్ ఫోటోలు, స్టైలిష్ లుక్స్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ‘జాతిరత్నాలు’ తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోయినా, వరుసగా విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘బంగార్రాజు’, ‘మత్తు వదలరా 2’, ‘ఆ ఒక్కటీ అడక్కు’ వంటి చిత్రాల్లో కనిపించిన ఫరియా తాజాగా ‘గాయపడ్డ సింహం’ సినిమాలో నటించింది. ఈ చిత్రంలో వ్లాగర్ షాలిని పాత్ర తనకు ఎంతో నచ్చిందని ఆమె తెలిపింది. దర్శకుడు కశ్యప్ రూపొందించిన యూనివర్స్, పాత్రలు ప్రేక్షకులను నవ్విస్తాయని చెప్పింది. భవిష్యత్తులో పూర్తి నిడివి కలిగిన బలమైన పాత్రలు చేయాలనే లక్ష్యంతో ఉన్న ఫరియా, వచ్చే ఏడాది దర్శకురాలిగా కూడా మారనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ‘భగవంతుడు’, ‘సిగ్మా’ చిత్రాలతో పాటు సత్యదేవ్‌తో ఓ సినిమా చేస్తుండగా, మరో రెండు కొత్త ప్రాజెక్టులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి.
- June 8, 2026
0
35
Less than a minute
You can share this post!
editor

