‘పురుష :’కు ఓటీటీలో సూపర్ రెస్పాన్స్

‘పురుష :’కు ఓటీటీలో సూపర్ రెస్పాన్స్

పవన్ కళ్యాణ్ హీరోగా వీరు వులవల దర్శకత్వంలో తెరకెక్కిన ‘పురుష :’ సినిమా ఓటీటీలో మంచి ఆదరణ పొందుతోంది. మే 22న థియేటర్లలో విడుదలైన ఈ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహాలో స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. బ్రహ్మచారి అయిన వ్యక్తి పెళ్లి తర్వాత ఎదుర్కొనే సరదా సంఘటనలు, కుటుంబ బంధాలు, భావోద్వేగాలతో ఈ సినిమాని రూపొందించారు. కామెడీతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

సప్తగిరి, వెన్నెల కిషోర్, కసిరెడ్డి రాజ్‌కుమార్ తమ హాస్యంతో సినిమాకు ప్రత్యేక బలాన్ని చేకూర్చారు. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాని ఆస్వాదిస్తున్నారు.

బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్, రాజీవ్ కనకాల, అనంత్ శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్ హీరోయిన్లుగా నటించారు.

Related Articles