నిర్మాత దిల్ రాజు.. తన తమ్ముడు శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా ఓ భారీ సినిమాని నిర్మించనున్నారు. ఓ కొత్త కుర్రాడు దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటివరకూ ఆశిష్ నటించిన రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలకు భిన్నంగా పూర్తి తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా ఉంటుందని విశ్వసనీయ సమాచారం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల మేళవింపైన కథతో రూపొందనున్న ఈ సినిమాలో.. విలేజ్ ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా, వైలెన్స్.. అన్నీ కంటెంట్‌కి తగ్గట్టుగా ఉంటాయని, ఆశిష్ కేరక్టర్ కూడా ఊరమాస్‌గా డిజైన్ చేయడం జరిగిందని తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే.. బతుకమ్మ పండుగ ఈ కథలో కీలకమట. మొత్తంగా తెలంగాణ మట్టివాసన గుబాళించే కథతో ఈ సినిమా రూపొందనున్నదని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సివుంది.

- March 24, 2025
0
15
Less than a minute
Tags:
You can share this post!
editor