సక్సెస్, ఫెయిల్యూర్‌లకు సంబంధం లేని స్టార్‌డమ్ విజయ్ దేవరకొండది. సరైన సినిమా పడితే.. రికార్డులు బద్దలుకొట్టడం ఖాయం. అలాంటి విజయం కోసం తనతో పాటు తన అభిమానులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘కింగ్ డమ్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి ‘జెర్సీ’ సినిమా వాణిజ్యపరంగా విజయాన్ని సాధించడంతోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో గౌతమ్ చేస్తున్న ‘కింగ్ డమ్’ సినిమా కూడా మనసుల్ని మెలిపెట్టే భావోద్వేగాలతో విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. వారం రోజుల షెడ్యూల్‌ని మేకర్స్ శ్రీలంకలో ప్లాన్ చేశారు. అక్కడ ఓ లవ్‌సాంగ్‌తో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట. అందుకే చిత్ర యూనిట్ శ్రీలంక పయనమయ్యారు. దీనికి సంబంధించిన విజయ్ దేవరకొండ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రౌడీ ట్రెండీ సమ్మర్ వేర్‌లో స్టైల్ ఐకాన్‌గా ఈ ఫొటోల్లో విజయ్ కనిపిస్తున్నారు. మే 30న ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్.

- March 24, 2025
0
14
Less than a minute
Tags:
You can share this post!
editor