యదార్థ సంఘటనతో వస్తున్న దూరదర్శిని.. మే 15

యదార్థ సంఘటనతో వస్తున్న దూరదర్శిని.. మే 15

యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఫీల్ గుడ్ లవ్ ఎంటర్‌టైనర్ దూరదర్శిని మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. సువిక్షిత్, గీతికా రతన్ జంటగా నటించిన ఈ చిత్రానికి కార్తికేయ కొమ్మి దర్శకత్వం వహించారు. వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి, పాటిమీది సంతోష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హైదరాబాద్‌లో జరిగిన చిత్రలహరి మీట్‌లో దర్శకుడు మాట్లాడుతూ, ఇది కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాదని, తల్లిదండ్రులు, యూత్, సమాజానికి నచ్చే అంశాలు ఇందులో ఉన్నాయని తెలిపారు. ఈ సినిమా 90వ దశకం రోజులను, చిత్రలహరి కోసం ఎదురుచూసిన మధుర క్షణాలను గుర్తుకు తెస్తుందని అన్నారు. సినిమాలోని ఎమోషన్స్ ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటాయని, క్లైమాక్స్ ఆలోచింపజేస్తుందని చెప్పారు. సినిమా చూసిన తర్వాత ఆ ఫీలింగ్ వెంటాడుతుందని వెల్లడించారు. హీరో సువిక్షిత్‌కు మంచి గుర్తింపు తెచ్చే చిత్రంగా ఇది నిలుస్తుందని చిత్రబృందం నమ్మకం వ్యక్తం చేసింది.

Related Articles