క్రికెట్ అభిమానులకి పరిచయం అక్కర్లేని పేరు డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియా తరపున ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ ఐపీఎల్‌లోను సందడి చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున కొన్నాళ్లు ఆడిన వార్నర్ 2016లో ట్రోఫీ కూడా అందించి పెట్టాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్లీ ఆ జట్టు ఐపీఎల్ ట్రోఫీ అందుకోలేకపోయింది. అయితే వార్నర్ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీ20 లీగుల్లో ఆడుతున్నాడు. అయితే ఐపీఎల్‌కు దూరం అయినప్పటికి తెలుగు వారికి మంచి వినోదం పంచాలని డేవిడ్ వార్నర్ రాబిన్ హుడ్ అనే సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ఈ పాత్ర మెమరబుల్‌గా ఉంటుందని తెలుస్తోంది. నితిన్, శ్రీలీల ప్రధాన పాత్రలలో వెంకీ కుడుముల రూపొందించిన ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే గత రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ వేడుకకి డేవిడ్ వార్నర్ కూడా హాజరయ్యారు. ఈవెంట్‌లో డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ అందరికీ నమస్కారం అంటూ పలకరించాడు. రాబిన్ హుడ్ టీమ్ తనకు ఎంతో సపోర్ట్ ఇచ్చిందన్నాడు. ఇక ఈ సినిమాతో మీ కుటుంబంలో నన్ను చేర్చుకున్నందుకు ఎంతో ఆనందంగా, గౌరవంగా ఉందని తెలియజేశాడు. సినిమా టీమ్ ఎంతో కష్టపడింది కాబట్టి సినిమా పెద్ద విజయం సాధిస్తుందని తెలియజేశాడు. ఇక స్పీచ్ అనంతరం డేవిడ్ వార్నర్‌ని తెలుగులో ఏదైనా చెప్పమని అడిగారు దర్శకుడు వెంకీ. ఇందుకు “నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని వెరైటీగా చెప్పి వార్నర్ అందరిని నవ్వించాడు.

- March 24, 2025
0
12
Less than a minute
Tags:
You can share this post!
editor