గాయపడ్డ సింహం సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీ విష్ణు స్పెషల్ రోల్ చేయడం విశేషం. రైటర్-డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే మంచి బజ్ తెచ్చింది. తాజాగా నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో నారా రోహిత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాతలు కళ్యాణ్, భాను, విజయ్‌లకు ఈ సినిమా మెమొరబుల్ ఫిల్మ్ కావాలని కోరుకున్నారు. అలాగే ప్రేక్షకులు మే 1న థియేటర్లలో సినిమా చూసి ఎంజాయ్ చేయాలని, పైరసీని ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేశారు. ఫారియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. మంచి ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
- April 29, 2026
0
4
Less than a minute
You can share this post!
editor

