‘రాజా సాబ్‌’లో హీరోయిన్‌గా చేయడం కంటే ఆనందం ఏముంది?

‘రాజా సాబ్‌’లో హీరోయిన్‌గా చేయడం కంటే ఆనందం ఏముంది?

తమిళంలో హీరోల సరసన నటించి ప్రతిభావంతురాలైన హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది మాళవిక మోహనన్‌. ఈ హీరోయిన్ తెలుగులో ప్రభాస్‌ సరసన ‘రాజా సాబ్‌’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ సందర్భంగా ప్రభాస్‌ మంచితనం, సహృదయతకు తాను ఫిదా అయిపోయానని, ముఖ్యంగా ఆయన ఇంటి నుండి తీసుకొచ్చే ఫుడ్‌ అద్భుతమని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌ను పొగడ్తల్లో ముంచెత్తిందీ హీరోయిన్. తాజాగా మరోసారి ప్రభాస్‌ గురించి మాట్లాడింది. ప్రభాస్‌ వంటి గ్రేట్‌ పర్సన్‌తో నటించడం తన అదృష్టమని, తన కెరీర్‌లోనే మైలురాయిలా నిలిచే చిత్రమవుతుందని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ‘నిజంగా ఈ సినిమా ఛాన్స్‌ రావడం లక్కీగా ఫీలవుతున్నా. షూటింగ్‌ అంతా సరదాగా సాగిపోతోంది. ప్రభాస్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోడానికి మించిన ఆనందం ఏముంటుంది? ఈ సినిమాను జీవితాంతం గుర్తుంచుకుంటా’ అని ఆనందం వ్యక్తం చేసింది మాళవిక మోహనన్‌. హర్రర్‌ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ‘రాజా సాబ్‌’ ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది.

editor

Related Articles