కొత్త దర్శకుడి కథకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన అక్కినేని అఖిల్‌?

కొత్త దర్శకుడి కథకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన అక్కినేని అఖిల్‌?

హీరో అక్కినేని అఖిల్‌ దూకుడు పెంచారు. ప్రస్తుతం మురళీకిషోర్‌ అబ్బూరి దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో అనిల్‌ అనే కొత్త దర్శకుడితో కూడా ఓ సినిమా చేయనున్నారు అఖిల్‌. రీసెంట్‌గా మరో దర్శకుడికి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు ఫిల్మ్‌ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ దర్శకుడి పేరు నందు. ‘సామజవరగమన’ సినిమాకు మాటల రచయిత అయిన నందు.. ఇటీవలే తాను తయారు చేసుకున్న కథను అఖిల్‌కి వినిపించారట. నిజానికి విక్టరీ వెంకటేష్‌తో నందు సినిమా చేయాల్సింది. ఆయన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు ముందు వెంకీకి ఓ కథ వినిపించారు. ఆయనకు కూడా కథ నచ్చింది. అయితే.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవ్వగానే నందు సినిమా విషయంలో వెంకటేష్ పునరాలోచనలో పడ్డారట. దాంతో ఆ ప్రాజెక్ట్‌ అక్కడితో ఆగింది. అతనే ఇప్పుడు అఖిల్‌కి కథ చెప్పి ఓకే చేయించుకున్నారన్నది ఫిల్మ్‌వర్గాల సమాచారం.

editor

Related Articles