‘ఈ సృష్టి చక్రం నిరంతరాయంగా తిరుగుతూనే ఉంటుంది. కొత్త నక్షత్రాలు పుట్టుకొస్తుంటాయి.. పాత నక్షత్రాలు కనుమరుగవుతుంటాయి. ఈ వెలుగులు అశాశ్వతం. కాకపోతే కొన్ని వెలుగులు ఎక్కువకాలం ఉండొచ్చు. కొన్ని తక్కువ కాలం ఉండొచ్చు. కానీ కనుమరగవ్వడం ఖాయం’ అన్నారు బాలీవుడ్ హీరో అమిర్‌ఖాన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హీరోల స్టార్‌డమ్ గురించి ఆయన ఆసక్తికరంగా మాట్లాడారు. ఇంకా చెబుతూ ‘బాలీవుడ్‌లో ఖాన్ త్రయమే చివరి స్టార్స్ అనుకోవడం మూర్ఖత్వం. ప్రతి తరంలో వారికి నచ్చే స్టార్లు వస్తూనే ఉంటారు. మా అదృష్టం బావుంది కాబట్టి రెండు మూడు తరాలు మమ్మల్ని చూశాయి. ఎప్పటికైనా మేమూ ఫేడ్ అవుట్ అవ్వక తప్పదు. పాత నీరు పోయి కొత్త నీరు వచ్చే పరిణామక్రమం ఇదంతా. నేను, సల్మాన్, షారుఖ్ కలిసి ఒక సినిమాలో నటించాలనే కోరిక చాలామంది వ్యక్తం చేశారు. మాకూ ఆ ఆలోచన ఉంది. అయితే.. అందుకు తగ్గ కథ కుదరాలి. అలాంటి కథ దొరికితే తప్పకుండా కలిసి నటిస్తాం.’ అంటూ చెప్పుకొచ్చారు అమిర్‌ఖాన్.

- March 25, 2025
0
12
Less than a minute
Tags:
You can share this post!
editor