సముద్రతీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూపర్ స్టార్ రజనీకాంత్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కొత్త వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. మన దేశ కీర్తిని దెబ్బతీసేందుకు ఉగ్రవాదులు సముద్రమార్గం ద్వారా చొరబడి విధ్వంసం సృష్టిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా 26/11 ముంబై ఉగ్రదాడి ఘటనను రజనీకాంత్ ఉదహరించారు. ఈ దాడి ఘటనలో సుమారు 175 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. అందువల్ల సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 100 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లు పశ్చిమ బెంగాల్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 7 వేల కిలోమీటర్ల సైకిల్ ప్రచార యాత్ర చేపట్టనున్నారని తెలిపారు. వారు మీ ప్రాంతాలకు వచ్చేటప్పుడు స్వాగతించాలని సూచించారు. కుదిరితే వారితో కొంచెం దూరం వెళ్లి వారికి సహకరించాలని కోరారు.

- March 24, 2025
0
12
Less than a minute
Tags:
You can share this post!
editor