‘ది ఫ్యామిలీ స్టార్’ తర్వాత విజయ్ దేవరకొండ సోలో హీరోగా సినిమా చేయలేదు. మధ్యలో ‘కల్కి 2898 ఏడీ’లో అర్జునుడిగా యాక్ట్ చేశారు విజయ్. సోలో హీరోగా ఆయన నటించే సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘కింగ్‌డమ్’ సినిమా చేస్తున్నారు విజయ్. ఈ నేపథ్యంలో వారి అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ తన ఇన్‌స్టాలో ఓ స్టోరీ పెట్టారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ‘కింగ్‌డమ్’ డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ చెప్పేశా. గౌతమ్ ఓ వండర్ క్రియేట్ చేశాడు.. అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు. డబ్బింగ్ థియేటర్‌లో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, తాను చర్చించుకుంటున్న ఓ ఫొటోని కూడా ఈ స్టోరీతోపాటు ఆయన షేర్ చేశారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర వేరే లెవల్లో ఉంటుందని ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ చెబుతోంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవించందర్, నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య.

- April 16, 2025
0
18
Less than a minute
Tags:
You can share this post!
editor