తొలిసారి క్యాన్స‌ర్‌పై ఓపెన్ అయిన శివ‌రాజ్ కుమార్..

తొలిసారి క్యాన్స‌ర్‌పై ఓపెన్ అయిన శివ‌రాజ్ కుమార్..

క‌న్న‌డ హీరో శివరాజ్ కుమార్ తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా చాలా సుప‌రిచిత‌మే. ప‌లు తెలుగు సినిమాల‌లో న‌టించి మెప్పించిన ఆయ‌న ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న పెద్ది అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గత కొన్ని నెల‌లుగా క‌న్నడ హీరో శివ‌రాజ్ కుమార్ క్యాన్సర్‌తో పోరాడుతున్న విష‌యం తెలిసిందే. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని మయామీ క్యాన్సర్ ఆసుపత్రిలో క్యాన్సర్ కోసం శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు.  ఆప‌రేష‌న్ అనంతరం శివ‌రాజ్ కుమార్ క్యాన్స‌ర్ నుండి పూర్తిగా కోలుకున్న‌ట్లు అత‌డి భార్య గీత శివ‌రాజ్ కుమార్ జనవరి 1న‌ వెల్ల‌డించింది. మార్చి నుండి ఆయ‌న తిరిగి సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్న‌ట్టు తెలుస్తోంది.

editor

Related Articles