ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, అన్నా లెజినోవా తిరుమల యాత్ర ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత రెండు రోజుల నుంచి ఈవిడ గురించి దేశం మొత్తం చర్చిస్తోంది. తన కొడుకు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో చిక్కుకుని తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకోవడంతో అన్నా లెజినోవా తిరుమలకి వచ్చి మొక్కు చెల్లించుకుంది. తలనీలాలు కూడా సమర్పించింది. విదేశాల నుండి వచ్చి, పుట్టుకతోనే వేరే మతం ఐనప్పటికీ హిందూ ధర్మాన్ని అన్నా లెజినోవా నమ్మడం గొప్ప విషయం అని చాలామంది పొగిడారు. కాని కొందరు మాత్రం అన్నా లెజినోవాని ట్రోల్ చేస్తున్నారు. క్రిస్టియన్ అయి ఉండి తిరుమలకి రావడం ఏంటి, మహిళ అయి ఉండి తలనీలాలు సమర్పించడం ఏంటని కొందరు నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. వారందరికీ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ, టాలీవుడ్ సీనియర్ నటి విజయశాంతి గట్టిగా సమాధానం ఇచ్చారు. తన ఎక్స్ ఖాతాలో దేశం కాని దేశం నుండి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సతీమణి అన్నా లెజినోవాపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం.

- April 16, 2025
0
15
Less than a minute
Tags:
You can share this post!
editor