ప్రేమికుల రోజు అంటే 22 ఏళ్ల కన్నా తక్కువ ఏజ్‌లో ఉన్న వాళ్లకే…

ప్రేమికుల రోజు అంటే 22 ఏళ్ల కన్నా తక్కువ ఏజ్‌లో ఉన్న వాళ్లకే…

నేడు ప్రేమికుల రోజు సందర్భంగా చిరంజీవి కోడలు ఉపాసన  పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తోంది. నేడు ప్రేమికుల రోజు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా ప్రత్యేక పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో చిరంజీవి కోడలు, హీరో రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తోంది. ప్రేమికుల రోజు అనేది 22 ఏళ్లు అంతకంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయిలకు సంబంధించిందని పేర్కొన్నారు. ‘వాలంటైన్స్‌ డే అనేది 22 ఏళ్లు అంతకంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయిలకు సంబంధించింది. మీరు అంతకంటే పెద్దవారైతే.. ఆంటీ ప్లీజ్‌ ఇంటర్నేషనల్‌ ఉమెన్స్‌ డే  కోసం వెయిట్‌ చేయండి’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో ఉపాసన రాసుకొచ్చారు.

editor

Related Articles