యంగ్ హీరో Nikhil Siddhartha తన ప్రతిష్టాత్మక చిత్రం ‘స్వయంభూ’తో భారీ అంచనాలు రేకెత్తిస్తున్నారు. దర్శకుడు భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ మూవీ, పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘రా రా ధీవర’ సినిమాపై హైప్‌ను మరింత పెంచింది. సంగీత దర్శకుడు Ravi Basrur అందించిన పవర్‌ఫుల్ బీట్‌లు, ఆర్కెస్ట్రేషన్ పాటను యోధుని నినాదంలా నిలబెట్టాయి. సంతోష్ వెంకీ వోకల్స్, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం పాటకు మరింత బలం చేకూర్చాయి. ఈ పాటలో నిఖిల్ రఫ్ అండ్ టఫ్ లుక్‌లో, యుద్ధానికి సిద్ధమైన యోధుడిలా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. Nabha Natesh తన ప్రెజెన్స్‌తో విజువల్స్‌కు గ్లామర్ జోడించారు. సినిమాటోగ్రఫీని కేకే సెంథిల్ కుమార్ అద్భుతంగా చూపించారు. గ్రాండ్ సెట్స్, యాక్షన్ సీక్వెన్సులు సినిమాకు భారీ స్థాయి తెచ్చాయి. ఈ మ్యూజికల్ లాంచ్‌తో ‘స్వయంభూ’పై అంచనాలు మరింత పెరిగాయి.
- April 17, 2026
0
147
Less than a minute
You can share this post!
editor

