పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ నుండి సెకండ్ సింగిల్ సాంగ్ ఇచ్చారు నిర్మాతలు. ఏపీ డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్‌లలో హరిహర వీరమల్లు ఒకటి. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాను 2025 మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు నిర్మాతలు. ఇప్పటికే మాట వినాలి అనే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా సెకండ్ సింగిల్ అప్‌డేట్‌ను షేర్ చేసింది. ఈ సినిమా నుండి కొల్లగొట్టినాదిరో అనే రెండో సింగిల్ సాంగ్‌ను ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా వాలంటైన్స్ డేను పురస్కరించుకొని కొత్త పోస్టర్‌ను షేర్ చేసింది. జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సినిమాలో నిధి అగర్వాల్ ఫిమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.

- February 14, 2025
0
20
Less than a minute
Tags:
You can share this post!
editor