నిర్మాత అల్లు అరవింద్ సాయి పల్లవితో కలిసి డాన్స్ చేశారు. హీరో నాగ చైతన్య కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా తండేల్. కార్తికేయ 1, 2 సినిమాలతో సూపర్ హిట్‌లు అందుకున్న చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రూ.100 కోట్ల దిశగా దూసుకెళుతోంది. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో ‘తండేల్’ థాంక్యూ మీట్ నిర్వహించింది చిత్రబృందం. హీరో నాగచైతన్య డ్యాన్స్ చేసి ఫ్యాన్స్‌ను అలరించారు. ఈ సందర్భంగా సినిమా యూనిట్ తమ సినిమాను ఆదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది.

- February 14, 2025
0
18
Less than a minute
Tags:
You can share this post!
editor