ఉదయభాను చాలా కాలం తర్వాత సినిమాలో…

ఉదయభాను చాలా కాలం తర్వాత సినిమాలో…

ఘటోత్కచుడి కొడుకు బార్బరికుడు పాత్ర ఆధారం చేసుకుని రూపొందుతున్న సినిమా ‘త్రిబాణధారి బార్బరిక్‌’. మోహన్‌ శ్రీవత్స డైరెక్టర్. విజయ్‌పాల్‌ రెడ్డి అదిధాల నిర్మాత. శుక్రవారం ఈ సినిమా నుండి ఉదయభాను పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆమె వాకిలి పద్మ అనే పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపిస్తుందని, కథాగమనంలో కీలకంగా నటిస్తోందని సినిమా బృందం పేర్కొంది. చాలాకాలం విరామం తర్వాత ఉదయభానుకు మంచి పాత్ర దక్కిందని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు చేపట్టారని, త్వరలో రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. సత్యరాజ్‌, వశిష్ట ఎన్‌ సింహా తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: ఇన్ఫ్యూషన్‌ బ్యాండ్‌.

administrator

Related Articles