మూగ, వినికిడి శక్తి లేకపోయిన తన టాలెంట్‌తో మంచి నటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది నటి అభినయ. తమిళనాడుకు చెందిన ఈమె తెలుగులో కూడా చాలా సినిమాలు చేసింది. 2008లో తెలుగులో వచ్చిన ‘నేనింతే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఇందులో చిన్న పాత్రలో కనిపించి అలరించింది. ఆ తర్వాత కింగ్, శంభో శివ శంభో, దమ్ము, ఢమరుకం, జీనియస్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ధృవ, రాజుగారి గది 2, సీతారామం, ది ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలలో తన నటనతో ఎంతగానో మెప్పించింది. తమిళంలో ఆమె నటించిన ‘నాడోడిగల్’ సినిమాకి గాను బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ విభాగంలో ఫిల్మ్ ఫేర్ అవార్డును కూడా అందుకుంది. 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న అభినయ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇలా పలు భాషలలో సినిమాలు చేసింది. మరికొన్ని గంటల్లోనే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్న అభినయ.. తాజాగా తన పెళ్లి వేడుకలకి సంబంధించిన ఫొటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. కార్తీక్ అనే వ్యక్తిని అభినయ పెళ్లి చేసుకోనుండగా, అతనితో కలిసి మెహందీ వేడుకలో దిగిన క్యూట్ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

- April 16, 2025
0
14
Less than a minute
Tags:
You can share this post!
editor