2:45 గంటలు రన్‌టైమ్‌తో సెన్సార్ పూర్తి చేసుకున్న ‘గేమ్ ఛేంజ‌ర్’..

2:45 గంటలు రన్‌టైమ్‌తో సెన్సార్ పూర్తి చేసుకున్న ‘గేమ్ ఛేంజ‌ర్’..

హీరో రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న హై వోల్టేజ్ యాక్ష‌న్ సినిమా గేమ్ ఛేంజ‌ర్‌. త‌మిళ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. కార్తీక్ సుబ్బ‌రాజు క‌థ‌ను అందిస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ సినిమా కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే. జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈ సినిమా. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. ర‌న్ టైం విష‌యానికి వ‌స్తే.. 165.30 నిమిషాల (2:45 గంటలు) రన్‌టైమ్‌తో ఈ సినిమా అలరించడానికి సిద్ధమైంది. మ‌రోవైపు ఈరోజు సాయంత్రం 5 గంట‌ల‌కు ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్నారు మేక‌ర్స్. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ డ్యూయ‌ల్ రోల్‌లో న‌టించ‌బోతున్నాడు. కియ‌రా అద్వాని, అంజలి, సముద్రఖని, సునీల్‌, శ్రీకాంత్‌, నాజర్‌ తదితరులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

editor

Related Articles