లాస్ట్ ఇయర్ ‘కెప్టెన్ మిల్లర్’, ‘రాయన్’ వంటి సినిమాలతో సూపర్ హిట్‌లను అందుకున్నాడు ధనుష్. రాయన్ సినిమాతో అయితే మెగఫోన్ పట్టి మరోసారి దర్శకుడిగా నిరూపించుకున్నాడు. అయితే ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘ఇడ్లీ కడై (ఇడ్లీ కొట్టు)’. ఈ సినిమాలో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్నారు. నిత్యామీనన్ కథానాయికగా నటిస్తోంది. అయితే న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే.. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాను సమ్మర్ కానుకగా.. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

- January 2, 2025
0
11
Less than a minute
You can share this post!
editor