Movie Muzz

వెయ్యికోట్ల బడ్జెట్‌తో 50 భాషల్లో విడుదల చేస్తున్న సినిమా..

వెయ్యికోట్ల బడ్జెట్‌తో 50 భాషల్లో విడుదల చేస్తున్న సినిమా..

ప్రపంచ సినీ వేదికపై సముచితస్థానాన్ని దక్కించుకున్న భారతీయ సినీదర్శకుడు మాత్రం ఒక్క రాజమౌళి మాత్రమే. ఆయన సినిమా ఓపెనింగ్‌కి ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు జేమ్స్‌ కామెరూన్‌, స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ రానున్నారని తెలుస్తోంది. మహేష్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో కె.ఎల్‌.నారాయణ నిర్మించే ఈ పాన్‌ వరల్డ్‌ మూవీ 2025 జనవరిలో ప్రారంభం కానున్నదనేది లేటెస్ట్‌ న్యూస్‌. ఈ వేడుకకు జేమ్స్‌ కామెరూన్‌, స్టీవెల్‌ స్పీల్‌బర్గ్‌ అతిథులుగా రానున్నారని సమాచారం. ఈ ఫ్రాంచైజీని వెయ్యికోట్ల బడ్జెట్‌తో నిర్మించనున్నట్టు సమాచారం. 50 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ట్రజర్‌ హంట్‌ కథాంశమని టాక్‌. ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా చేస్తున్నారు.

administrator

Related Articles