‘గేమ్‌ఛేంజర్’లో నటించేటప్పుడు మీలో ఉన్న డైరెక్టర్ ఎప్పుడైనా బయటకు వచ్చారా? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘ప్లేయర్‌గా ఆడుతున్నప్పుడు ఆట మీదే దృష్టి పెట్టాలి. పక్క చూపులు చూడకూడదు. నటుడిగా ఉన్నప్పుడు పాత్రపైనే దృష్టి పెట్టాలి. ఇతర వ్యవహారాల్లో వేలు పెట్టకూడదు.’ అని నట దర్శకుడు ఎస్.జె.సూర్య అంటున్నారు. రామ్‌చరణ్ హీరోగా, శంకర్ డైరెక్షన్‌లో దిల్‌రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో ఆయన కీలక పాత్రధారి. ఈ సినిమా వచ్చే 10 తారీకున ప్రపంచవ్యాప్తంగా పానిండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ఎస్.జె.సూర్య విలేకరులతో మాట్లాడారు. ‘శంకర్‌కి సలహాలిచ్చే స్థాయి నాకు లేదు. ఆయన విజనరీ మనిషి. నా నటన చూసి ఇంప్రస్ అయ్యి, ‘ఇండియన్ 2’లో నాకు అవకాశం ఇచ్చారు. శంకర్ సార్ డైరెక్షన్‌లో చేయడం ఓ గొప్ప వరంగా భావిస్తాను.’ అని ఎస్.జె.సూర్య చెప్పారు. రామ్‌చరణ్‌లోని గొప్ప నటుణ్ణి ఈ సినిమాలో చూస్తారని, ఐఏఎస్ రామ్‌నందన్‌గా, అప్పన్నగా రెండు విభిన్న పాత్రల్లో ఆయన కనిపిస్తారని, ముఖ్యంగా అప్పన్న లైఫ్ టైమ్ గుర్తిండిపోయే పాత్ర అని సూర్య తెలిపారు. సూర్య డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా నాకు చాలా కష్టం అనిపించింది. తెలుగు, తమిళ, హిందీ అన్ని భాషల్లో నేనే డబ్బింగ్ చెప్పాను అని ఎస్.జె.సూర్య చెప్పారు.

- January 6, 2025
0
16
Less than a minute
Tags:
You can share this post!
editor