‘సినిమా ఒప్పుకున్న తర్వాత డైరెక్టర్‌పై నమ్మకం పెట్టి యాక్షన్‌లోకి వెళ్లాలి. అప్పుడే కథలోని పాత్రకు కనెక్ట్ అవుతాం’ అంటోంది అందాలభామ త్రిప్తి డిమ్రీ. ఇటీవల తనిచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. ‘యానిమల్’ ఆఫర్ రాగానే దర్శకుడు సందీప్‌ని కలిశా. ఆయన నాకు కథ చెప్పలేదు. జోయా పాత్ర గురించే చెప్పారు. ఆ సినిమాకు ముందు నేను చేసినవన్నీ సున్నితమైన, పాజిటివ్ రోల్సే. ‘యానిమల్’లో జోయా పాత్ర వాటికి పూర్తి వ్యతిరేకం. తన మనసులో మోసం చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ, ఫేస్‌లో దయ, సానుభూతి కనిపించాలని సందీప్ చెప్పారు. అది నాకు సవాలుగా అనిపించింది. వెంటనే ఓకే చేశాను. సందీప్‌ని నమ్మి ముందుకెళ్లాను. ఫలితం మీఅందరికీ తెలుసు. చాలామంది ‘యానిమల్’కి స్త్రీ ద్వేషి సినిమాగా ట్యాగ్ ఇస్తున్నారు. నేనైతే ఒప్పుకోను. ‘యానిమల్’ అనేది ఓ క్యారెక్టరైజేషన్. దానిచుట్టూ కథ నడుస్తుంది.

- January 6, 2025
0
41
Less than a minute
Tags:
You can share this post!
editor