ప్రముఖ టాలీవుడ్ రచయిత అనంత శ్రీరామ్ అమరావతిలో జరిగిన హైందవ శంఖారావం బహిరంగ సభలో తెలుగు ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలుగుతో పాటు ఇండియన్ సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతోందని.. సినిమాల్లో మన పురాణాలను వక్రీకరిస్తున్నారని.. హైందవ ధర్మ హననం జరుగుతోందని అనంత్ శ్రీరామ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. తెర వెనక సినిమాల్లో అన్య మతస్థులు చేసేది ఒక్క అనుభవం చెప్పి మీకు ముగిస్తాను ఒక సినిమా పాట రాయడానికి నేను ఒక సంగీత దర్శకుడి దగ్గరికి వెళితే.. ఒక పాటలో ‘బ్రహ్మాండ నాయకుడు’ అన్న హిందూపదం ఉందని చెప్పి ఆ పాటకు నేను మ్యూజిక్ చేయనన్నాడు. దీంతో నేను.. నువ్వు ఒక్క హిందూ పదం ఉందని చెప్పి పాటకి మ్యూజిక్ సమకూర్చనన్నావు కాబట్టి జీవితాంతం నువ్వు చేసిన ఏ పాటకి నేను రాయనని చెప్పి ప్రతిజ్ఞ చేసి 15 ఏళ్లుగా ఆ వ్యక్తికి నేను పాట రాయలేదు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అనంత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. ఇక అనంత్‌కి అలా చెప్పిన సంగీత దర్శకుడు ఎవరని నెటిజన్లు బుర్రలు బద్దలు గొట్టుకుంటున్నారు.

- January 6, 2025
0
14
Less than a minute
Tags:
You can share this post!
editor