బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో ప్రముఖ యాంకర్, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఇదే కేసులో విష్ణుప్రియ, రీతూ చౌదరిని పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. కాగా, ఆంధ్రా 365 అనే ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌కు శ్యామల ప్రమోషన్ చేసింది. ఈ వ్యవహారంలో గత శుక్రవారం విచారణకు రావాలంటూ పోలీసులు ఆమెకు నోటీసులిచ్చారు. దీంతో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెను అరెస్టు చేయవద్దని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. విచారణకు సహకరించాలని సూచించింది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన కేసులో ఏడుగురు సినీ నటులతోపాటు 25 మందిపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వారిలో దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాశ్‌రాజ్, నిధి అగర్వాల్ ఉన్నారు. మియాపూర్ ప్రగతినగర్‌కు చెందిన ప్రదీప్‌శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు.

- March 24, 2025
0
12
Less than a minute
Tags:
You can share this post!
editor