ఒకప్పుడు పోకిరి, దేశముదురు, అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి వంటి బ్లాక్ బస్టర్‌లతో పాటు ఇండస్ట్రీ హిట్‌లను అందించిన పూరి ప్రస్తుతం సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందడంతో పూరి పని అయిపోయిందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఏదో ఒకరోజు సాలిడ్ కమ్‌బ్యాక్‌తో మళ్లీ ఫాంలోకి వస్తాడని అతడి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇదిలావుంటే పూరి తమిళ నటుడు విజయ్ సేతుపతితో ఒక సినిమా తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు తెలిపింది. రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభమవుతుందని వెల్లడించింది. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ ఇస్తామని తెలిపింది. ఈ సినిమాకు సినీనటి చార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి విజయ్ సేతుపతి అభిమానులతో పాటు తమిళ మీడియాకు చెందిన వ్యక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు.

- April 2, 2025
0
9
Less than a minute
Tags:
You can share this post!
editor