అభిమానులు తమ అభిమాన హీరోయిన్ పట్ల అమితమైన ప్రేమని పెంచుకుంటారు. కొందరు పాలాభిషేకాలు చేయడం, ఇంకొందరు వారి పేరుతో దాన ధర్మాలు చేయడం వంటివి చేస్తుంటారు. అభిమానం మరింత ఎక్కువైతే వారికి గుడులు కట్టి ఏకంగా పూజలు కూడా చేస్తుంటారు. గతంలో తమిళనాట హీరోయిన్స్ ఖుష్బు, నమితలకు గుడి కట్టారు అభిమానులు. తొలిసారి సందీప్ అనే వ్యక్తి సమంతకి గుడి కట్టి హిస్టరీ క్రియేట్ చేశాడు. బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన కార్ డ్రైవర్ సందీప్ సమంతకు వీర అభిమాని కాగా, ఆమెపై అతనికి ఉన్న అభిమానం గుడి రూపంలో చూపించాడు. తన ఇంటి ఆవరణలోనే గుడి కట్టి నిత్యం ఆమెకి పూజలు చేస్తున్నాడట. సమంత మంచి మనసుకి నేను ఫిదా అయ్యాను. ఆమె ఎందరికో ఎన్నో సహాయ సహకారాలు అందజేస్తోంది. అందుకే నేను ఆమెకి వీరాభిమానిని అయ్యాను అని చెప్పుకొచ్చారు.

- April 2, 2025
0
11
Less than a minute
Tags:
You can share this post!
editor