బాలీవుడ్ రియల్ హీరో సోనూ సూద్ భార్య సోనాలి సూద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సోనాలి సూద్ తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. సోనాలి సూద్ తన సోదరి, సోదరి కుమారుడితో కలిసి సోమవారం రాత్రి కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ముంబై – నాగ్‌పూర్ హైవేపై వీరి కారు ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సోనాలి, ఆమె సోదరి కుమారుడికి తీవ్రంగా గాయాలైనట్లు తెలిసింది. ఆమె సోదరి మాత్రం స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం. సోనాలి, ఆమె సోదరి కుమారుడు నాగ్‌పూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సోనూసూద్ స్వయంగా వెల్లడించారు. దేవుడి దయవల్ల పెద్ద ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. మరోవైపు ప్రమాద సమాచారం అందుకున్న సోనూసూద్ ఇవాళ ఉదయం నాగ్‌పూర్ చేరుకున్నారు. ప్రమాదంలో వారి కారు పూర్తిగా దెబ్బతింది.

- March 25, 2025
0
16
Less than a minute
Tags:
You can share this post!
editor