ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు తెలుగులో క్లాసులు తీసుకున్నారు నటులు నితిన్, శ్రీలీల. వీరిద్దరు జంటగా నటిస్తున్న తాజా సినిమా ‘రాబిన్‌హుడ్’. ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తుండగా.. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, డేవిడ్ వార్నర్, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల హైదారాబాద్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు క్రికెటర్ డేవిడ్ వార్నర్ ముఖ్య అతిథిగా వచ్చి సినిమా విజయవంతం కావాలని కోరుకోవడంతో పాటు తెలుగులో మాట్లాడి అందరినీ అలరించారు. అయితే డేవిడ్ తెలుగులో మాట్లాడటానికి నితిన్, శ్రీలీల ఏ విధంగా సాయం చేశారో పై ఫొటోలో చూడవచ్చు..

- March 25, 2025
0
15
Less than a minute
Tags:
You can share this post!
editor