సోనూ నిగ‌మ్‌పై రాళ్ల దాడి..

సోనూ నిగ‌మ్‌పై రాళ్ల దాడి..

ఇండియ‌న్ సినీపరిశ్రమలోని ప్రసిద్ధ గాయకులలో సోనూ నిగమ్ ఒకరు. హిందీలో ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన పాట‌లు పాడి శ్రోత‌ల‌ని ఆక‌ట్టుకున్నారు. సోనూ నిగమ్ ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ పాటలను పాడి మంచిపేరు తెచ్చుకున్నాడు. అత‌నికి సొంతంగా బ్యాండ్ కూడా ఉంది. సోనూ నిగమ్ హిందీలోనే కాకుండా తమిళం, తెలుగు, కన్నడలోనూ అనేక పాటలు పాడారు. అయితే తాజాగా అత‌నిపై దాడి జ‌రిగింది. ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో జరిగిన ఇంజిఫెస్ట్ 2025 కార్యక్రమంలో పాడేందుకు వచ్చిన సోను నిగమ్‌పై అనేకమంది విద్యార్థులు రాళ్ళు, సీసాలను విసిరి దాడి చేశారు. లైవ్ షో స‌మ‌యంలో వారు అలా చేయ‌డంతో సోనూ నిగ‌మ్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. విద్యార్థులు గౌరవంగా ప్రవర్తించాలని, మీతో మంచి సమయం గడిపేందుకు నేను మీ కోసం ఇక్కడికి వచ్చినట్లు సోను చెప్పారు. అయితే వారు చేసిన దాడితో సోనూ జ‌ట్టు స‌భ్యుల్లో కొంద‌రు గాయ‌ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది.

editor

Related Articles