బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇటీవల ఆస్కార్ అవార్డులపై తన అభిప్రాయం వ్యక్తం చేసింది. 2023లో ఆస్కార్ అవార్డులకు హాజరై వార్తల్లో నిలిచిన దీపికా.. భారతీయ సినిమాలకు ఆస్కార్ అవార్డులు దక్కకపోవడంపై విచారం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఇటీవల ‘ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్’, ‘మిస్సింగ్ లేడీస్’ అనే భారతీయ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా పలు వేదికలపై ప్రశంసలు అందుకున్నాయి. ఈ సినిమాలు ఆస్కార్ 2025 తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాయి. ఈ సినిమాలు భారతీయ అభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి. అడ్రియన్ బ్రాడీకి అవార్డు దక్కడంపై సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. భారతీయ సినిమాలకు దక్కకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. భారత్ చాలాసార్లు ఆస్కార్ అవార్డులను కోల్పోయిందని పేర్కొంది. అవార్డుకు అర్హత ఉన్న అనేక సినిమాలు వచ్చాయని.. కానీ వాటన్నింటిని విస్మరించినట్లు పేర్కొంది. 2023లో ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ఆస్కార్ అవార్డు గెలిచిన సందర్భంలో భావోద్వేగానికి గురైనట్లు చెప్పింది.

- March 24, 2025
0
11
Less than a minute
Tags:
You can share this post!
editor