“తుంబాడ్” నుండి సాలిడ్ సీక్వెల్‌ అనౌన్స్..

“తుంబాడ్” నుండి సాలిడ్ సీక్వెల్‌ అనౌన్స్..

ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి ఆల్ టైం కల్ట్ హారర్ థ్రిల్లర్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది హిందీ సినిమా “తుంబాడ్” అని చెప్పొచ్చు. మరి ఈ సినిమా అప్పట్లో ప్లాప్ అయినప్పటికీ ఇపుడు మళ్ళీ రీ రిలీజ్‌ అయిన తర్వాత ఈ సినిమా అప్పటికి మించి భారీ వసూళ్లు అందుకుంది. మరి ఈ రీ రిలీజ్‌తోనే మేకర్స్ దీనికి సీక్వెల్‌ని కూడా అనౌన్స్ చేసి ఓ రేంజ్‌లో ఫ్యాన్స్‌ని ఎగ్జైట్ చేశారు. ఇక ఈ సీక్వెల్‌పై లేటెస్ట్‌గా దర్శకుడు అనీల్ రాహి బార్వె సాలిడ్ అనౌన్సమెంట్ ఇచ్చారు.

దీంతో ఈ క్రేజీ థ్రిల్లర్‌కి ఒకటి కాదు రెండు సీక్వెల్స్ ఉంటాయని కన్ఫర్మ్ చేశారు. తన తుంబాడ్ నుండి రెండో భాగం ఈ రానున్న 2026 లో మొదలవుతుంది అని తెలిపారు. ప్రస్తుతం అయితే ఈ దర్శకుడు నెట్ ఫ్లిక్స్‌లో భారీ వెబ్ సిరీస్ “రక్త బ్రహ్మాండ్” అనే సిరీస్‌ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో స్టార్ హీరోయిన్ సమంత సహా బాలీవుడ్ ప్రముఖులు నటిస్తున్నారు.

administrator

Related Articles