టాలీవుడ్ సింగర్లు రమ్య బెహరా – అనురాగ్ కులకర్ణి ప్రేక్షకులందరికీ సుపరిచితమే. తాజాగా వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఈ వేడుక ఇరు కుటుంబాల పెద్దలు, పరిశ్రమకు చెందిన పలువురు గాయనీ, గాయకులు, సంగీత దర్శకుల సమక్షంలో ఈవేడుక జరిగింది. అయితే వీరి వివాహం జరుగుతున్నట్లు ముందుగా ఎలాంటి వార్తలు రాలేదు. ఒక్కసారిగా వారి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో అంతా సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఇది ప్రేమ వివాహమా? ఎరేంజ్‌డ్ మ్యారేజా? అన్నది త్వరలో క్లారిటీగా తెలుస్తుంది. ఈ పెళ్లి గురించి ఇంకా రమ్య గానీ, కులకర్ణి గానీ స్పందించలేదు. అయితే నవదంపతులకు సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు, అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు. ఇక ఇద్దరు కలిసి జంటగా కొన్ని సినిమాల్లో పాటలు పాడారు. ఇప్పుడు రియల్ లైఫ్‌లో కలిశారు. ఇకపై భార్యాభర్తలుగా కలిసి పాడనున్నారు. అనురాగ్ కులకర్ణి. `సూపర్ సింగర్` ఈవెంట్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచమయ్యాడు. ఇందులో విజేతగా నిలవడంతో గాయకుడిగా సినిమాలకు పాడే అవకాశం వచ్చింది. `శతమానం భవతిలో `మెల్లగా తెల్లారిందో`, కాటమరాయుడులో `మిరా మిరా మీసం`, పైసా వసూల్‌లో టైటిల్ సాంగ్, ఇస్మార్ట్ శంకర్‌లో `ఉండిపో ఉండిపో` పాటలు సహా చాలా సినిమాల్లో పాటలు పాడాడు. ఇక రమ్య బెహరా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. గాయనిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కీరవాణి ఆమెని సినిమా గాయనిగా పరిచయం చేశారు. బాహుబలిలో `ధీవర` పాట ఆమెకు పాన్ ఇండియాలో మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

- November 16, 2024
0
27
Less than a minute
Tags:
You can share this post!
administrator