టాలీవుడ్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల సమంత. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఎంతోమంది మనసులని దోచుకుంది సమంత. కొన్నాళ్లపాటు ఈ హీరోయిన్ పర్సనల్ లైఫ్, కెరీర్ సజావుగానే సాగిన ఇటీవల మాత్రం కాస్త ట్రాక్ తప్పింది. నాగ చైతన్యతో విడాకులు, మయోసైటిస్ వ్యాధితో సమంత డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. నాగ చైతన్యతో విడాకులు తర్వాత సమంత తెలుగు సినిమాలు చేయడం కూడా తగ్గించేశారు. బాలీవుడ్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు అర్ధమవుతోంది. సమంత హీరోయిన్‌గానే కాకుండా నిర్మాతగా కూడా ప్రయత్నిస్తోంది. సామ్ ఫస్ట్ టైమ్ నిర్మాతగా చేసిన తొలి సినిమా శుభం టీజర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ‘త్రాలాలా మువింగ్ పిక్చ ర్స్’ పేరుతో ఆమె సొంత ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి తొలి సినిమాగా ‘శుభం సినిమాని ప్రేక్షకుల ముందుకు తెస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా సమంత రెండో పెళ్లికి సంబంధించి చాలా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ దర్శకుడు రాజు నిడుమోరుతో డేటింగ్ చేస్తోన్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు చాలాకాలంగా ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం సమంత, రాజ్‌ల పెళ్లి మేలో ఉంటుందని ఫిలిం నగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది.

- April 11, 2025
0
9
Less than a minute
Tags:
You can share this post!
editor