బెంగళూరు, ముంబయిలలో ఏది ఇష్టమో అంటే ఎలా చెప్పగలను!

బెంగళూరు, ముంబయిలలో ఏది ఇష్టమో అంటే ఎలా చెప్పగలను!

‘తరచుగా అడిగే ప్రశ్న’ ఇదేనంటూ హీరోయిన్ దీపికా పదుకొణె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ వీడియోను షేర్‌ చేసింది. అందులో తనకు ఎంతో ఇష్టమైన రెండు నగరాలు బెంగళూరు, ముంబయితో ఉన్న అనుబంధం గురించి మాట్లాడింది. బెంగళూరుకు ఎప్పుడు వచ్చినా తన సొంత ఇంటిలా ఫీలవుతానని చెప్పింది. ‘నా జీవితంలో ఎక్కువ భాగం బెంగళూరులోనే గడిచింది. చదువంతా అక్కడే సాగింది. స్కూల్‌, కాలేజీ తాలూకు ఎన్నో జ్ఞాపకాలు ఈ నగరంతో ముడిపడి ఉన్నాయి. ఇక ముంబయి గురించి చెప్పాలంటే.. వృత్తిపరంగా నాకు జీవితాన్నిచ్చింది. ముంబయి తాలూకు వైబ్స్‌ వేరుగా ఉంటాయి. ఈ రెండు నగరాలు నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో, విజయాల్లో కీలక భూమిక పోషించాయి. అందుకే ఏది ఇష్టమో కచ్చితంగా చెప్పలేను’ అని దీపికా పదుకొణె  పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

editor

Related Articles